ముచ్చటైన చిట్టి కధలు

ముచ్చటైన , తీయనైన, సరదాగా వ్రాస్తున్న మరపు రాని చిట్టి కధలు

Wednesday, September 30, 2009

గృహ హింస చట్టం

పోలీసు : "గృహ హింస చట్టం కింద మీ ఆవిడ మీద కేసు పెడుతున్నావ్ సరే , యింతకీ ఏమి చేసింది ఏమిటి?"

వ్యక్తి : " టీ వి సీరియల్స్ చూపిస్తోంది సార్"

Read more...

Monday, September 14, 2009

కిక్కు

అనగనగా ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీరు....రోజూ తిని, పని చేసి, తొంగుంటే మడిసి కి గొడ్డు కి తేడా ఉండదు అనుకుని వీలు చిక్కించుకుని అలా సరదాగా యాత్రలకు వెళ్లి వస్తుంటాడు. అలా వెళితే సమస్య ఉండదు కానీ వెధవది లైఫ్ లో ఏ పని చేసినా కాస్త కిక్ ఉండాలని అంటూ ఉంటాడు. ఒకసారి అలానే ఒక విహార యాత్ర చేస్తాడు. అది కాస్తా బెడిసి కొట్టి సాహస యాత్ర గా ఎలా మారిందో ........చూడండి

Read more...

Sunday, May 24, 2009

తెలుగు తెగులు

భార్య "ఏమండి మా టీవి వాళ్ళు వస్తున్నారు మీరు రెడీ నా వంట కి "

భర్త " నీకు తెలుగు ఎవడు నేర్పాడో గాని నా ప్రాణానికి వచ్చేటట్టు  వుంది .... అది మా  ఊరి వంటే ,మా వారి వంట కాదు "

ఈ కలియుగపు తెలుగు చదువుల వల్ల సామెతలు కూడా మారి పోతాయేమో . ఈ సామెత

ఎలావుందంటారు , " మా కొడుకు కోడలు కోక్ ఫ్లొట్ లో కోక్ , ఐస్ క్రీం లాగా కలిసిపోతారు "




Read more...

Sunday, May 10, 2009

హ్యాపీ మదర్స్ డే

పొద్దున్నే పేపర్ చూడగానే అర్థం అయ్యింది ఇవ్వాళా మదర్స్ డే అని. సరే మన కి ఉన్న

కుతూహలం తో మదర్స్ డే కి చిట్టి కథలు ద్వారా తెలుగు లో శుభాకాంక్షలు చెపుతాం అని

మొదలు పెట్టిని తర్వాత అర్థం అయ్యింది , కొన్ని ఆంగ్ల పండుగలకు అలాగే శుభాకాంక్షలు చెప్పాలి

గాని వాటిని తెలుగు లోకి మార్చ కూడదు అని.

ఇంతకీ మదర్స్ డే ని తెలుగు లో ఏమంటారు?

అమ్మల రోజు

అమ్మల పండుగ

అమ్మల దినోత్సవం

ఇంకా రాస్తే బూతులు వస్తాయేమో!


Read more...

Saturday, May 2, 2009

శ్రీ శ్రీ గారు బెంగళూరు వస్తే ?

ఏ బెంగళూరు రోడ్డు చూసినా ఏమున్నది కొత్తదనం ,

ఆగి పోయిన కార్లు

నిలిచిపోయిన బైకులు


Read more...

Wednesday, April 29, 2009

మే డే - కార్మికులకు సెలవ రోజు


కొన్ని ఏళ్ళ కిందట మే డే రోజు నాన్నగారు ఇవ్వాళ్ళ మాకు సెలవు అంటే ఎంతో అనందం వేసేది. ఎందుకు నాన్నగారు అని ఆడితే ఇవ్వాళా కార్మికుల రోజు అందుకే మాకు సెలవు అనెవారు. కానీ ఈ రోజుల్లో నాన్నగారు ఫోను చేసి ఎరా మీకు మే డే కి సెలవు వుందా అని అడిగితే " లేదు నాన్నగారు మేము  ఈ దేశానికి కార్మికులం కాదు మేము అమెరికా దేశానికి బానిసలం" అని చెప్పుకోవాల్సి వస్తోంది. ఏమిటో స్వతంత్రం వచ్చిన తరువాత కూడా మనకి ఈ బానిసత్వం.
 

Read more...

Tuesday, April 21, 2009

హంపి యాత్ర - మొదటి పార్టు

హంపి యాత్ర ఫోటోలు . యాత్ర రివ్యూ త్వరలో . చాలా చెప్పాలి ..

Read more...